కొడాలి నానికి షాక్ ఇచ్చిన పోలీసులు! హత్యాయత్నం కేసులో కీలక నిందితుడి అరెస్టు! వాళ్ళకి భయం అంటే ఇప్పుడు తెలుస్తుంది!

Header Banner

కొడాలి నానికి షాక్ ఇచ్చిన పోలీసులు! హత్యాయత్నం కేసులో కీలక నిందితుడి అరెస్టు! వాళ్ళకి భయం అంటే ఇప్పుడు తెలుస్తుంది!

  Wed Jan 01, 2025 17:20        Politics

మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయన్ను గుడివాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 10 వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత నిందితుడు కాళీని పోలీసులు నెల్లూరు కేంద్ర కారాగారానికి . వైకాపా అధికారంలో ఉండగా గుడివాడ తెదేపా కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీ కీలక సూత్రధారి. 2022 డిసెంబరు 25న రాత్రి.. కాళీ తన అనుచరులతో కలిసి తెదేపా కార్యాలయం, రావిపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశాడు. ఈ సంఘటనపై రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా నాటి అధికార పార్టీ ప్రోద్బలంతో నిందితులను అరెస్టు చేయలేదు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



పైగా రావి వర్గీయులు, ఇతర తెదేపా నాయకులపై ఎదురు కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంఘటన వీడియోలను పోలీసులు పరిశీలించి హత్యాయత్నం సెక్షన్ను జోడించారు. ఈ క్రమంలో డిసెంబరు 4న పది మంది నిందితులను ఏకకాలంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ముఖ్య నిందితుడైన కాళీ.. అస్సాం రాష్ట్రంలో చేపల వ్యాపారం చేస్తున్నాడని గుర్తించి పక్కా ప్రణాళికతో మంగళవారం అదుపులోకి తీసుకుని గుడివాడకు తీసుకొచ్చారు. నేడు వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలుఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీతెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #arrest #murdercase #ykapanetha #todaynews #flashnews #latestupdate