రేషన్ బియ్యం మాయం కేసు విచారణలో కీలక మలుపు! ప్రభుత్వ వాహన వినియోగంపై చర్చ!

Header Banner

రేషన్ బియ్యం మాయం కేసు విచారణలో కీలక మలుపు! ప్రభుత్వ వాహన వినియోగంపై చర్చ!

  Wed Jan 01, 2025 18:36        Politics

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో జయసుధ ఏ1గా ఉన్నారు. ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె న్యాయవాదులతో కలిసి కలిసి బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. జయసుధ తరపు న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆర్.పేట సీఐ ఏసుబాబు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే, జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీసు స్టేషన్కు వచ్చారు. ప్రభుత్వ వాహనంలో ఆమె విచారణకు రావడం చర్చనీయాంశమైంది.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



పేర్ని జయసుధను విచారణ చేస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద వైకాపా శ్రేణులు హడావుడి చేశారు. ఆమెను ఎంత సేపు విచారిస్తారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు పలువురు వైకాపా శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారని జయసుధ తరపు న్యాయవాదులు అసహనం వ్యక్తం చేశారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలుఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీతెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #rice #mafiya #scam #inquiry #todaynews #flashnews #latestupdate