ఏపీలో వారందరి పింఛన్‌లు కట్! ఈ నెలలోనే ఫిక్స్! ఈ తప్పు అస్సలు చేయొద్దు!

Header Banner

ఏపీలో వారందరి పింఛన్‌లు కట్! ఈ నెలలోనే ఫిక్స్! ఈ తప్పు అస్సలు చేయొద్దు!

  Sat Jan 04, 2025 12:00        Politics

ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టింది.. ఈ మేరకు ఈ నెల 6 నుంచి తనిఖీలు చేపట్టనుంది. హెల్త్, దివ్యాంగుల కేటగిరిలో పింఛన్‌లు తీసుకుంటున్నవారికి పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు మెడికల్ టీమ్‌లు సిద్ధమయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలను ముమ్మరం చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు జిల్లాలారీగా మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులపై ఏరివేతపై ఫోకస్ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో బోగస్‌ పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులతో పాటుగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హుల విషయంలో సీరియస్‌గా స్పందించింది. గత నెలలో రెండు రోజుల పాటూ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పింఛన్‌లను తనిఖీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సదరమ్‌ సర్టిఫికేట్లతో పింఛన్ పొందతున్నట్లు గుర్తించింది. ఆ తర్వాత జరిగిన కలెక్టర్ల సదస్సుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌ల తనిఖీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను తనిఖీ చేయించాలని నిర్ణయించింది.

 

ఈ నెల 6 (సోమవారం) నుంచి పింఛన్‌ల తనిఖీ ప్రక్రియను ప్రారంభించనుంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా మంచానికే పరిమితమై నెలకు రూ.15వేల చొప్పున పింఛను అందుకుంటున్నవారు 24వేల91మంది ఉన్నారు. అలాగే దివ్యాంగుల కేటగిరిలో నెలకు రూ.6వేలు పింఛన్ తీసుకుంటున్నవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా 8.18 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వీరందరి వివరాలను తనిఖీ చేసేందుకు సిద్ధమైంది. జనవరి 6 నుంచి ఈ పింఛన్‌లను తనిఖీ చేయనున్నారు అధికారులు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ పింఛన్ తనిఖీలకు సంబంధించి.. జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా మంచానికే పరిమితమైనవారి ఇళ్ల దగ్గరకే వైద్యబృందాలు వెళ్లి తనిఖీలు (అవసరమైన పరీక్షలు) చేస్తాయి. అలాగే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునేవారిని దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తారు. పింఛన్ లబ్ధిదారులు ఏ రోజు రావాలో ముందుగానే వారికి తెలియజేస్తారు. అంతేకాదు రోజుకు కనీసం 25మంది చొప్పున ఒక్కో వైద్య బృందం తనిఖీ చేయనుంది.

 

ఒకవేళ పింఛనుదారులు ఈ పరీక్షలకు హాజరుకాకపోయినా.. వైద్యబృందం ఇంటికి వెళ్లినసమయంలో అందుబాటులో లేకపోయినా వారి పింఛన్లను ప్రభుత్వం హోల్డ్‌లో ఉంచుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా వాటిలో మళ్లీ 5% లబ్ధిదారుల వివరాలను ర్యాండమ్‌గా పరిశీలించనున్నారు. దీని కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని నియమించనుంది. ఈ మేరకు ఒకవేళ ర్యాండమ్‌ తనిఖీల్లో అనర్హులకు ఇంకా పింఛన్లు కేటాయించినట్లు తేలితే.. దీనికి బాధ్యులైన వైద్యాధికారులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఈ మేరకు పింఛన్ల తనిఖీల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.

 

అనర్హుల పింఛన్‌లను ఏరివేస్తూనే.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు కూడా పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. పింఛన్‌లు తీసుకునేవారు ఈ తనిఖీలకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.. ఎవరూ తప్పు చేయొద్దని సూచించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP