గ‌ల్ప్ బ్యాంక్ లో మ‌ల‌యాళీల 700 కోట్ల స్కామ్! కేర‌ళకు వచ్చిన బ్యాంక్ మేనేజర్!

Header Banner

గ‌ల్ప్ బ్యాంక్ లో మ‌ల‌యాళీల 700 కోట్ల స్కామ్! కేర‌ళకు వచ్చిన బ్యాంక్ మేనేజర్!

  Sat Dec 07, 2024 13:39        Gulf News

కేర‌ళ న‌ర్సుల‌పై భారీ కేసులు న‌మోదు అయ్యాయి. కువైట్‌కు చెందిన గ‌ల్ప్ బ్యాంక్ నుంచి కోట్ల రుణం తీసుకుని ఉడాయించారు. సుమారు 1400 మంది మ‌ల‌యాళీలు.. దాదాపు 700 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన‌ట్లు తెలుస్తోంది. సాల‌రీ స‌ర్టిఫికేట్ల‌ను గ్యారెంటీగా పెట్టి .. గ‌ల్ప్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేర‌ళ‌లో ద‌ర్యాప్తు మొద‌లైంది.

 

ఈ నేప‌థ్యంలో గ‌ల్ప్ బ్యాంక్‌కు చెందిన డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కేర‌ళ‌ను విజిట్ చేశారు. లా అండ్ ఆర్డ‌ర్ ఏడీజీపీకి ఆయ‌న ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇప్ప‌టికే 10 కేసులు న‌మోదు చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఆ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్కొక్క న‌ర్సు సుమారు 50 లక్ష‌ల నుంచి 2 కోట్ల వ‌ర‌కు రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

 

ఇంకా చదవండిఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గ‌ల్ఫ్ బ్యాంక్ కువైట్ షేర్‌హోల్డింగ్ కంపెనీ లో మోసం జ‌రిగిన‌ట్లు గుర్తించారు. నిందితుల్లో ఎక్కువ శాతం మంది న‌ర్సులే ఉన్న‌ట్లు తేలింది. డిఫాల్ట‌ర్ల వివ‌రాల‌ను పోలీసుల‌కు బ్యాంకు వెల్ల‌డించింది. ఆ వివరాల ఆధారంగా కేసుల‌ను రిజిస్ట‌ర్ చేస్తున్నారు. మూడు నెల‌ల క్రితం బ్యాంకులో ఫ్రాడ్ జ‌రిగిన‌ట్లు గుర్తించారు. తొలుత చిన్న రుణాల‌ను తీసుకుని.. వాటిని స‌కాలంలో చెల్లించేవారు. దీంతో బ్యాంకు న‌మ్మ‌కాన్ని గెలుచుకునేవారు. 2020 నుంచి 2022 మ‌ధ్య కాలంలో ఈ ఫ్రాడ్ జ‌రిగింది.

 

ఆ త‌ర్వాత భారీ మొత్తంలో లోన్ తీసుకుని .. విదేశాల‌కు లేదా స్వంత దేశాల‌కు వెళ్లిపోతున్న‌ట్లు బ్యాంక్ ఆరోపించింది. రుణం తీసుకున్న వారి లోక‌ల్ అడ్రెస్సులు బ్యాంక్ వ‌ద్ద ఉన్నాయి. ఆ వివ‌రాల‌ను పోలీసుల‌కు అంద‌జేశారు. చాలా ప్లాన్ ప్ర‌కారం ఫ్రాడ్ జ‌రిగిన‌ట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ కేసులో ద‌ర్యాప్తు కోసం కేర‌ళ పోలీసుల్ని ఆశ్ర‌యించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

   

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Kerala #Nurses #GulfBank #Bank #Scam