కువైట్ నుంచి వచ్చాడు - చంపాడు - వెళ్లాడు! వీడియో విడుదల చేసిన నిందితుడు! తప్పంతా పోలీసులదేనా?

Header Banner

కువైట్ నుంచి వచ్చాడు - చంపాడు - వెళ్లాడు! వీడియో విడుదల చేసిన నిందితుడు! తప్పంతా పోలీసులదేనా?

  Thu Dec 12, 2024 10:26        Gulf News, Kuwait

ఓ వ్యక్తి కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి చడీ చప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. తను హత్య చేసిన విషయం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, ఎందుకు చేసిందీ వివరించడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఈ విషయం తీవ్ర సంచలనం అయింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి చట్టపరంగా న్యాయం జరగకపోవడంతో తాను హంతకుడనయ్యానని పేర్కొన్నాడు. విషయంలోకి వెళితే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో వీరు తమ కుమార్తె (12)ను గ్రామంలో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకట రమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకట రమణ తండ్రి గుట్ట ఆంజనేయులు (దివ్యాంగుడు) మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. దీనిపై ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. దీంతో చంద్రకళ ఆందోళనతో కువైట్ నుండి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

 

ఇంకా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను!

 

పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలివేశారు. దీంతో చంద్రకళ ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది. అడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆంజనేయ ప్రసాద్ అవేదన చెందాడు. ఆగ్రహంతో కువైట్ నుంచి వచ్చి శనివారం వేకువజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం తెలియక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కువైట్ వెళ్లిన తర్వాత ఆంజనేయ ప్రసాద్ తానే ఆంజనేయులును హత్య చేసినట్లుగా సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనం అయింది. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని పేర్కొన్నాడు. చట్టప్రకారం న్యాయం జరగకే హత్య చేశానని చెప్పుకొచ్చాడు.  


ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Kuwait #AndhraPradesh #Dead #FireAccdent #Chandrababu